భారీ వర్షాలు.. 54 విమానాలు రద్దు

భారీ వర్షాలు.. 54 విమానాలు రద్దు

దిత్వా తుఫాన్ కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వివిధ జిల్లాలకు నడిచే 54 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో NDRF, SDRF బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. ప్రభావిత జిల్లాల్లో 6వేల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.