ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారికి పంచఅమృతాలతో అభిషేకం చేసి.. విశేషంగా అలంకరించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.