మున్సిపల్ ప్రత్యేక అధికారిగా RDO

మున్సిపల్ ప్రత్యేక అధికారిగా RDO

PLD: మాచర్ల పురపాలక సంఘ ప్రత్యేక అధికారిగా గురజాల ఆర్డీవో మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 18వ తేదీ నుంచి ప్రస్తుత పాలకవర్గం తప్పుకోనుంది. పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పెషల్ అధికారులను నియమించింది. నూతన పాలకవర్గం ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలనలో పురపాలక సంఘం నడవనుందని ప్రభుత్వం తెలిపింది.