'ఫ్లెక్సీలు, హోర్డింగులకు పన్ను తప్పనిసరి'
PLD: నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బోర్డులు, హోర్డింగులకు తప్పనిసరిగా మున్సిపాలిటీలో పన్ను చెల్లించి, అనుమతులు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు, బోర్డులు, హోర్డింగుల ఏర్పాటుకు మున్సిపాలిటీ పన్ను తదితర అంశాలపై మున్సిపల్ కార్యాలయంలో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు.