చిట్యాలలో సామూహిక గేయాలాపాన
BHPL: వందేమాతరం జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం చిట్యాల మండలంలో BJP నేతలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలసి సామూహిక గేయాలాపాన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. వందేమాతరం స్వాతంత్య్ర సమరంలో దేశభక్తిని రగిలించిన మహామంత్రమని, యువతలో జాతీయ భావాన్ని పెంపొందించే శక్తిగా నిలుస్తుందని అన్నారు.