పారా అథ్లెటిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి

పారా అథ్లెటిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి

AKP: కోటవురట్ల మండలం పాములవాక జడ్పీ హైస్కూల్‌కు చెందిన పోతల దుర్గాప్రసాద్ అనకాపల్లిలో జరిగిన పారా అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించాడు. 400 మీటర్ల పరుగు పందెంలో విన్నర్‌గా నిలిచినట్లు ఎంఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థి దుర్గాప్రసాద్‌ను ఎంఈవో,పీడీ సావిత్రి అభినందించారు.