110 మంది సైనికులతో కుప్పకూలిన విమానం
కొలంబియాలో భారీ విమాన ప్రమాదం జరిగింది. పెరూ సరిహద్దు సమీపంలో 110 మంది సైనికులతో వెళ్తున్న ఆర్మీ విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సైనికుల పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.