రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

E.G: నిడదవోలు మండలం సమీశ్ర గూడెం పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రాత్రి బైకుపై వస్తున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు అతడిని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధార్ కార్డు ఆధారంగా క్షతగాత్రుడిని నిడదవోలుకు చెందిన పార్థనాగుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.