మరోసారి మానవత్వం చాటిన ఎమ్మెల్యే బేబీనాయన

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే కేకే రంగారావు (బేబీ నాయన) మరోసారి మానవత్వం చాటుకున్నారు. శనివారం బాడంగి మండలం ముగడ గ్రామంలో రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే తన వాహనంలో వారిని బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరుండి పంపించారు. సరైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.