పోడు భూముల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

పోడు భూముల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

ADB: పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఇచ్చోడ మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషాను విన్నవించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత కొన్నేళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు.