VIDEO: అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని అన్నా క్యాంటీన్‌ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం క్యాంటీన్‌కు విచ్చేసిన ప్రజలను భోజనం ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేయాలా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ ముక్తకంఠంతో భోజనం రుచిగా ఉందని తెలియజేశారు. మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు మరిచిపోరాదని ఎమ్మెల్యే అన్నారు.