రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
CTR: పుంగనూరులో రేపు శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారి వాహన సేవలు జరగనున్నాయి.