'అడవి జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'
SRCL: అడవి జంతువుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని SRO కల్పనా దేవి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో అడవి జంతువుల సంరక్షణ అగ్ని ప్రమాదాల నివారణపై గురువారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అడవుల సంరక్షణతోనే జంతు సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. జంతువులను వేటాడటం చట్టరీత్యా నేరమన్నారు.