స్టేట్ ఫస్ట్ విద్యార్థినిని అభినందించిన మంత్రి లోకేశ్

స్టేట్ ఫస్ట్ విద్యార్థినిని అభినందించిన మంత్రి లోకేశ్

ప్రకాశం: కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని తమ్మినేని చాతుర్య ఇంటర్మీడియట్ హెచ్ఈసీలో వెయ్యికి 980 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మంగళవారం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చేతుల మీదుగా చాతుర్య 'షైనింగ్ స్టార్ 2025 'అవార్డు అందుకున్నారు. ఐఏఎస్ సాధించాలనేది తన లక్ష్యమని చాతుర్య అన్నారు.