'జి చెన్నారం-అనంతరం రోడ్డును నిర్మించాలి'

NLG: జి.చెన్నారం నుండి అనంతారం వరకు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అన్నారు. నల్లగొండ మండల కమిటీతో కలిసి ఆయన బుధవారం జి.చెన్నారంలో రోడ్డును పరిశీలించి మాట్లాడారు. రోడ్డుపై కనీసం నడవలేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.