VIDEO: వారికి సహాయం చేయడమే ప్రధాన ఉద్దేశం: జగ్గారెడ్డి
SRD: ఆపదలో ఉన్నవారికి సాయం చేయడమే ప్రధాన ఉద్దేశమని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెంలో మల్లన్న స్వామి జాతర ఉత్సవ వేడుకల్లో ఆయన సతీమణి నిర్మలరెడ్డితో హాజరై దర్శించుకున్నారు. కులాలు అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండడమే మల్లన్న, బీరప్ప కథలో సారాంశమని పేర్కొన్నారు.