వీపనగండ్లలో హెచ్‌పీవీ టీకా ప్రారంభం
WNP: వీపనగండ్ల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని వైద్యాధికారి డా. రాజశేఖర్ ఇవాళ ప్రారంభించారు. 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా అందిస్తున్నారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ నివారణకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.