ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం శావల్యాపురం గ్రామంలోని జెడ్పీహెచ్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు విభాగాలను పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఆయన, విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు.