రేపు నగరంలో జాబ్ మేళా
MBNR: పట్టణంలోని పిల్లలమర్రి రోడ్డులో ఉన్న జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రి ప్రియ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మూడు ప్రైవేటు సంస్థలలో 370 ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నామని వెల్లడించారు.