'ప్రజలను సంతృప్తి పరిచేలా మున్సిపల్ సేవలు ఉండాలి'

'ప్రజలను సంతృప్తి పరిచేలా మున్సిపల్ సేవలు ఉండాలి'

VZM: ప్రజలను సంతృప్తి పరిచేలా మున్సిపల్‌ కార్పొరేషన్‌ సేవలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్‌, కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి రామ్‌ సుందర్‌ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, వీధి లైట్లు, అన్న క్యాంటీన్ల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు.