VIDEO: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

ASR: కొయ్యూరు మండలంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా ఏకధాటిగా వర్షం పడుతోంది. పనసలపాడు, ఎం.మాకవరం, నడింపాలెం, కాకరపాడు తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. రాగల 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.