252 జీవోను రద్దు కోరుతూ జర్నలిస్టుల ఆందోళన
HNK: 252 జీవోను వెంటనే రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు జర్నలిస్టులు శనివారం హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అక్రిడేషన్ విధానంలో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.