ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. ఇద్దరు మృతి
MHBD: కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామ శివారులోని మహబూబాబాద్–మరిపెడ హైవేపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమ్లా తండాకు చెందిన హచ్య ఫోన్‌లో మాట్లాడుతూ.. నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనదారుడు బోడ గణేష్ తీవ్రంగా గాయపడగా, అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసారు.