సిద్ధవటంలో ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలు

సిద్ధవటంలో ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలు

KDP: సిద్ధవటంలోని జ్యోతి గ్రామంలో సోమవారం రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన ఉత్కంఠ భరితంగా సాగింది. గంగమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన ఈ ప్రదర్శనలో చాపాడు, ప్రొద్దుటూరు, నంద్యాల, అనంతపురం ప్రాంతాల నుంచి ఆరు జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనలో ప్రొద్దుటూరు మండలం రంగసాయిపల్లెకు చెందిన మార్తల వెంకటసుబ్బారెడ్డి ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి.