మండలంలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
SRD: కంగ్టి మండలం చాప్టా(కె) గ్రామంలో ఈనెల 19న బసవేశ్వర విగ్రహావిష్కరణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరవుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బసవన్న భక్తులు భారీగా తరలివచ్చి విగ్రహావిష్కరణను జయప్రదం చేయాలని కోరారు.