మండలంలో తాగునీటి సమస్యకు చెక్

మండలంలో తాగునీటి సమస్యకు చెక్

VKB: బషీరాబాద్ మండలం కుప్పన్‌కోట్ పంచాయతీలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి బుధవారం చర్యలను ముమ్మరం చేశారు. ఈ మేరకు పంచాయతీకి రూ.5 లక్షల నిధులు మంజూరైనట్లు సర్పంచ్ రామ్ శెట్టి నాయక్ తెలిపారు. పంచాయతీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.2 లక్షల ఎన్డీఎఫ్ నిధులు, రూ.3 లక్షల డీఎంఎస్టీ నిధులు వచ్చాయని సర్పంచ్ పేర్కొన్నారు.