ఒకే సీజన్లో రెండోసారి వాత
NLG: కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లాలో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ యాసంగి సీజన్లోనే రెండోసారి ధరలు పెరగగా, తాజాగా బస్తాకు రూ.225 నుంచి రూ.300 వరకు అదనపు భారం పడింది. ఒక్క డీఏపీ, యూరియా మినహా పొటాష్ సహా మిగతా అన్ని రకాల ఎరువుల ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయి. దీనివల్ల రూ.109.50 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుందని సమాచారం.