SUలో చరిత్ర, టూరిజం విభాగ ఏర్పాటుకు వినతి

KNR: శాతవాహన యూనివర్సిటీలో చరిత్ర, టూరిజం విభాగం ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జాస్తి రవి కుమార్‌కు చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందజేశారు. అలాగే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శాతవాహన వంశ మూలపురుషుడైన శాతవాహనుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు.