అనుమానాస్పదంగా యువకుడి మృతి..
SRCL: వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాసారపు అభిలాష్ అనే యువకుడు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయ సమీపంలో అనుమానుస్పద స్థితిలో మృతి చెందాడు. అభిలాష్ నాలుగు రోజుల క్రితం నుంచే కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.