'సీఎం సహాయనిధి పేదలకు వరం'

SDPT: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని మర్కూక్ మండల మాజీ ఎంపీపీ తాండ పాండు గౌడ్ అన్నారు. పాములపర్తి గ్రామానికి చెందిన లెంకలి సత్తమ్మకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.13,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆదివారం అందజేశారు. సీఎం సహాయనిధి నిరుపేదలకు ఎంతో అండగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.