ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NGKL: తెలకపల్లి మండలం గౌరారం గ్రామంలో ఆదివారం సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి మల్లీశ్వరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన తాను అండగా ఉంటానని తెలిపారు.