మాదకద్రవ్యాల‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి

మాదకద్రవ్యాల‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి

NRPT: మాదకద్రవ్యాల వినియోగంతో జరిగే అనర్థాలు, అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్‌పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.