VIDEO: జలదిగ్బంధంలో గ్రామ సచివాలయం
VZM: మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్.కోట మండలం ఎస్.జీ పేటలో గల గ్రామ సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సచివాలయానికి అనుకొని ఉన్న మద్ది గెడ్డకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు కారణంగా గెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు గ్రామ సచివాలయాన్ని చుట్టుముట్టడంతో సచివాలయం సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు.