'శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

TPT: సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు అఘాయిత్యాలపై రక్షణ కోసం ప్రభుత్వం కల్పించిన శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని శ్రీసిటీ సీఐ బీవీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ మేరకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం చేసేవారిపై తమకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు.