రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీ కొట్టిన టిప్పర్

రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీ కొట్టిన టిప్పర్

RR: బండ్లగూడలోని ఆనంద్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బండ్లగూడ డిపో నుంచి నాగోల్ వైపు వెళ్తున్న ఓ టిప్పర్ ఆదివారం ప్రమాదవశాత్తు డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనలో టిప్పర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. కాగా, ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.