బయోచార్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

బయోచార్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ATP: గోరంట్ల మండలం పూలచెట్లపల్లిలోని బయోచార్ తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం సందర్శించారు. పంట వ్యర్థాలను కాల్చి తయారుచేసే ఈ ఎరువుల వల్ల నేల సారం పెరిగి, నీటిని నిల్వ ఉంచే శక్తి మెరుగుపడుతుందని నిర్వాహకులు కలెక్టరుకు వివరించారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా బయోచార్‌గా మార్చుకుని లబ్ధి పొందాలని ఆయన సూచించారు.