హోటళ్లపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు, కాగజ్ నగర్ పట్టణంలోని పలు హోటళ్లను రాష్ట్ర టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు జిల్లాలోని ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి గృహ అవసరాల సిలిండర్ల వినియోగాలపై తనిఖీలు నిర్వహించారు. కాగజ్ నగర్ పట్టణంలోని పలు హోటల్ వద్ద గృహ అవసర సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని హోటల్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.