మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఉద్రిక్తత
MHBD: మరిపెడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించి,దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.