కూటమి ప్రభుత్వంలోనే రైతులకు న్యాయం: నాదెండ్ల
AP: కూటమి ప్రభుత్వంలోనే రైతులకు న్యాయం జరిగిందని మంత్రి నాదెండ్ల అన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 4041 రైతు సేవా కేంద్రాలు, 3803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,700 మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, మొంథా తుఫాను నేపథ్యంలో 2,39,169 మంది కుటుంబాలకు నిత్యావసరాలు అందించినట్లు చెప్పారు.