ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గౌరీమణి తెలిపారు. వచ్చేనెల 15 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.