విద్యార్థినిలకు టవల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VSP: విశాఖలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో సుమారు 200 మంది విద్యార్థినులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రభుత్వం అందించిన టవల్స్‌ను పంపిణీ చేశారు. వసతి గృహంలో సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుందని, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తనకు ఫోన్ చేసి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, తదితరులు పాల్గొన్నారు.