BREAKING: సీఎం నివాసానికి బాంబు బెదిరింపు

తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. CM స్టాలిన్ నివాసంతో పాటు గవర్నర్ భవనం, రాష్ట్ర BJP ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అవి ఫేక్ కాల్స్ అని తేల్చిన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్స్ చేసిన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు.