VIDEO: మెదక్‌లో భారీ వర్షం
MDK: మెదక్‌లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో కమ్ముకొని అకస్మాత్తుగా వర్షం కురిసింది. మెదక్ పట్టణంతోపాటు, మండలంలో భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం, ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయింది. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.