నూతన రైతు సేవా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: అవనిగడ్డలో నూతన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. స్థానిక రెవెన్యూ హాల్ ఎదురుగా ఉపాధి నిధులు రూ.23.94 లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు రూ.4లక్షలు కలిపి ఈ భవనాన్ని నిర్మించారు. నూతన కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం పరీక్షను, వ్యవసాయ విజ్ఞాన పుస్తక ప్రదర్శనను, రైతుల కోసం సిద్ధం చేసిన గోనె సంచులు పరిశీలించారు.