రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: సంబేపల్లి మండలం నారాయణరెడ్డి పల్లె సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గరుగుపల్లెకు చెందిన ఓర్సు వాసుదేవును పీలేరు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తల, కుడిచేయి, ఎడమ కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన అతన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.