VIDEO: అహోబిలంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి గరుడ వాహనంపై దర్శనమిచ్చి పురవీధుల్లో విహరించారు. ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహుడు శేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఈ వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు.