'వేంకటేశుని పాదం' స్థలం గురించి తెలుసా?

CTR: రొంపిచర్ల-ఎం.బెస్తపల్లి మార్గంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. భక్తులు చిన్నగుడి కట్టి పూజలు చేస్తున్నారు. పెరటాసి నెల శనివారాల్లో ఇక్కడ పూజలు ఘనంగా జరుగుతాయి. తిరుమల వెళ్తూ శ్రీవారు ఇక్కడ ఎడమ పాదం మోపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రదేశాన్ని వేంకటేశుని పాదం అని పిలుస్తారు. ప్రస్తుతం ఇక్కడి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది.