ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో లష్కరే తోయిబా (LET) ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఘాజీపూర్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ మెట్రో స్టేషన్లలో దేశ వ్యతిరేక పోస్టర్లు అతికించిన ఘటనకు సంబంధించిన ఉగ్ర మాడ్యూల్‌కు షబీర్ లోన్ హ్యాండ్లర్‌గా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.