ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం ఉదయం 9:30 గంటలకు సారవకోట మండలం మార్కెట్ జంక్షన్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు సారవకోట మండలం బురజవాడ గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.