సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

WNP: పానగల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన లక్ష్మీకి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన రూ. 24,000 విలువైన చెక్కును మంగళవారం పానగల్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గిరిబాబు బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.